- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టోవినో థామస్: నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ‘డ్రాగన్’పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు… డ్రాగన్ సినిమాపై టోవినో థామస్ క్లారిటీ

దిశ, వెబ్ డెస్క్: మలయాళ నటుడు టోవినో థామస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు పెద్దగా ఇతర భాష చిత్రాల్లో నటించకపోయినా, ఆయన నటించిన సినిమాలు ఇతర భాషల్లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందడంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదలై మంచి విజయాలు సాధించడంతో, టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టోవినో థామస్‌కు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం టోవినో థామస్‌ను మేకర్స్ సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో టోవినో థామస్ మాట్లాడుతూ, తాను ఒకేసారి ఒకే సినిమాలో మాత్రమే పని చేయడం ఇష్టపడతానని, రెండు లేదా మూడు సినిమాలను ఒకేసారి చేయడం తన స్టైల్‌కు విరుద్ధమని తెలిపారు. అందువల్లే ప్రశాంత్ నీల్ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ, ఒకేసారి రెండు ప్రాజెక్టులు చేయలేనందున ఆ సినిమాను చేయలేకపోయినట్లు వెల్లడించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన టోవినో థామస్, తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. తాను సాధారణంగా బయట ఎక్కువగా మాట్లాడకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. అలాగే తనకు జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ ఎంతో ఇష్టమని, వారితో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని తెలిపారు. అయితే ఒకేసారి రెండు సినిమాల్లో నటించడం తనకు సాధ్యం కాకపోవడంతోనే ఆ ప్రాజెక్టులో భాగం కాలేకపోయానని, అంతకుమించి వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తాను ఆ సినిమాలో నటించకపోయినా, ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు టోవినో థామస్ తెలిపారు.






