- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టూరిస్ట్ ఫ్యామిలీ హవా.. లాభాలు చూస్తే షాకవ్వాల్సిందే
గత ఏడాది ఆరంభంలో మలయాళ సినిమా పరిశ్రమ ‘ప్రేమలు’, ‘మంజుమ్మేల్ బాయ్స్’, ‘భ్రమయుగం’ వంటి చిత్రాలతో వరుస విజయాలను సాధించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ప్రేమలు’, ‘మంజుమ్మేల్ బాయ్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించగా, పరిమిత పాత్రలతో ‘భ్రమయుగం’ సంచలనాత్మక విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: గత ఏడాది ఆరంభంలో మలయాళ సినిమా పరిశ్రమ ‘ప్రేమలు’, ‘మంజుమ్మేల్ బాయ్స్’, ‘భ్రమయుగం’ వంటి చిత్రాలతో వరుస విజయాలను సాధించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ప్రేమలు’, ‘మంజుమ్మేల్ బాయ్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించగా, పరిమిత పాత్రలతో ‘భ్రమయుగం’ సంచలనాత్మక విజయం సాధించింది. ఈ ఏడాది కూడా మలయాళ సినిమా అదే ఊపును కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో.. తమిళ సినిమా పరిశ్రమ కూడా నాణ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రం ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది. శశికుమార్, సిమ్రన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29, 2025న థియేటర్లలో విడుదలైంది. కేవలం 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా, 80 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కథ, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ధర్మదాస్ కుటుంబం జీవనోపాధి కోసం భారత్‌లోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది. తాము ఎక్కడి నుంచి వచ్చారో రహస్యంగా ఉంచి, స్థానికుల నమ్మకాన్ని పొందేందుకు వారు పడే కష్టాలు కథాంశంగా సాగుతుంది. వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని అందించే ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.






