- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ చిత్రం నా కెరీర్‌కి మంచి కిక్ ఇస్తుంది.. రాజ్ తరుణ్ కామెంట్స్ వైరల్
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ అండ్ ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘టార్టాయిస్’.

దిశ, సినిమా: ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ అండ్ ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘టార్టాయిస్’. రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి అండ్ రామిశెట్టి రాంబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘టార్టాయిస్ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ, దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంత మంచి కథతో వస్తున్నా మా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి అండ్ రామిశెట్టి రాంబాబు లకు కంగ్రాట్స్. ఈ చిత్రం నా కెరీర్‌కి మంచి కిక్ ఇస్తుంది’ అని తెలిపారు.
దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ.. ‘"టార్టాయిస్" చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్‌కి కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ అండ్ హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథతో మంచి థ్రిల్లర్ చిత్రం ఇది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈరోజు మా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసాం. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబులకు నా ధన్యవాదాలు’ అని తెలిపారు.






