- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి పీఠలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. హెల్దీ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టిక్‌టాక్ వీడియోల ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు హీరోయిన్ స్థాయికి వెళ్లిన యంగ్ బ్యూటీ దీపిక పిల్లి(Deepika Pilli) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: టిక్‌టాక్ వీడియోల ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు హీరోయిన్ స్థాయికి వెళ్లిన యంగ్ బ్యూటీ దీపిక పిల్లి(Deepika Pilli) మనందరికీ సుపరిచితమే. కెరీర్ స్టార్టింగ్‌లో జబర్దస్త్ షో(Jabardasth Show)లో కనిపించిన ఈ చిన్నది ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ(Dhee) డ్యాన్స్ షోలో టీమ్ లీడర్‌గా చేసింది. దీంతో ఈ అమ్మడుకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. దీంతో ఇటీవలే యాంకర్ ప్రదీప్(Pradeep) హీరోగా నటించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi Ikkada Abbayi) సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమాలో దీపిక యాక్టింగ్‌కి బానే మార్కులు పడ్డాయి. కానీ ఈ మూవీ మాత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా దీపిక తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో హల్దీ ఫంక్షన్(Haldi Function) ఫొటోస్ షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మ్యారేజ్ చేసుకుంటున్నావా అయితే కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link






