- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమాకు డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. డైలాగ్‌తో మూవీపై మరింత హైప్ పెంచేశాడుగా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో అలరించాడు. అయితే అతని ఖాతాలో మంచి హిట్ పడలేవు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో అలరించాడు. అయితే అతని ఖాతాలో మంచి హిట్ పడలేవు. కానీ రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం ‘దిల్ రూబా’(DilRuba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వకరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్(Rukshar Thillon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల దిల్ రూబా మూవీ రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మార్చి 14న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకొని మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా దిల్ రూబా సినిమాలో తనకు సంబంధించిన డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ‘భయం ఉన్నోడు గుడికి వెళ్తాడు. బాధతో ఉన్నోడు బార్‌కి వెళ్తాడు. ఒకటి టైంతో నడిచేది. ఇంకొకటి ఎనీ టైం నడిచేది’ అనే చెప్పే డైలాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. ఇక వీడియో చూసినట్లయితే ఈ డైలాగ్ కిరణ్ అబ్బవరం ఎంట్రీ అప్పుడు చెప్పేదానిలాగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.






