- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి అడ్డంగా దొరికేసిన టాలీవుడ్ రూమర్ జంట.. నెట్టింట విమర్శల జల్లు(వీడియో)
గీత గోవిందం(Geetha Govindam), ‘డియర్ కామ్రెడ్’(Dear Comrade) వంటి సినిమాల్లో జంటగా నటించిన హీరో, హీరోయిన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: గీత గోవిందం(Geetha Govindam), ‘డియర్ కామ్రెడ్’(Dear Comrade) వంటి సినిమాల్లో జంటగా నటించిన హీరో, హీరోయిన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాల సమయం నుంచే వారిద్దరు ఒకరినొకరు ఇష్ట పడుతున్నారు. అంతేకాదు వీరిద్దరూ వేకెషన్స్‌కి వెళ్లడం, పలు హోటల్స్‌కి వెళ్తుండటం వంటి ఫొటోలు, వీడియోలు చాలానే బయటికి వచ్చాయి. అంతేకాకుండా విజయ్ వాళ్ల ఇంట్లో పలుమార్లు నేషనల్ క్రష్ స్టే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ జంట కచ్చితంగా పెళ్లి కూడా చేసుకుంటుంది అని ఫిక్స్ అయిపోయారు.
కానీ ఈ పుకార్లపై వీరిద్దరూ స్పందించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఈ జంటకు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వీడియాలో.. రష్మిక అండ్ విజయ్ దేవరకొండ ఇద్దరూ జిమ్‌కి వెళ్లి తిరిగి వస్తున్నారు. అయితే నడవలేని స్థితిలో ఉన్న రష్మిక వాకర్ సాయంతో బయటకు రాగా, కారు ఎక్కేందుకు ఆమె ఇబ్బంది పడుతున్నప్పటికీ విజయ్ రష్మికకు సాయం చేయలేదు. దీనిపై ఆమె అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు.
తన గర్ల్ ఫ్రెండ్‌ని అలాంటి సిట్యూ వేషన్‌లో అలా వదిలేయడం ఏంటి అని తెగ మండి పడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం రష్మిక ‘ఛావా’(Chhaava), ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend), ‘రెయిన్ బో’(Rainbow) వంటి సినిమాల్లో నటిస్తుండగా.. విజయ్ దేవరకొండ ‘VD-12’, ‘VD-14’ వంటి మూవీలో నటిస్తున్నాడు. అయితే వీడీ-14లో విజయ్‌కి జంటగా రష్మిక కనిపించనున్నట్లు సమాచారం.






