- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బి.ఎన్. రెడ్డి పేరు మీద ఒక అవార్డును ప్రదానం చేయడం గౌరవంగా ఉంది.. ప్రముఖ డైరెక్టర్ పోస్ట్ వైరల్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాల్ని (Gaddar Film Awards) గురువారం (మే 29) హైదరాబాద్‌లో ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాల్ని (Gaddar Film Awards) గురువారం (మే 29) హైదరాబాద్‌లో ప్రకటించారు. 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఎంపికైంది. ఈ సినిమాతో పాటుగా.. గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప)ను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి ఉత్తమ చిత్రంగా - కల్కి, రెండవ ఉత్తమ చిత్రంగా - పొట్టేల్, మూడవ ఉత్తమ చిత్రంగా - లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రకటించింది.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎస్.జె.సూర్య (సరిపోదా శనివారం), బెస్ట్ మేల్ సింగర్ - సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), బెస్ట్ ఫీమేల్ సింగర్ - శ్రేయా ఘోషల్(పుష్ప-2), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - శరణ్యా ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్- యధువంశీ(కమిటీ కుర్రాళ్లు), బెస్ట్ ఫీచర్ హెరిటేజ్ ఫిల్మ్ - రజాకార్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం- ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి , స్పెషల్ జ్యూరీ అవార్డ్ - దుల్కర్ సల్మాన్(లక్కీభాస్కర్), స్పెషల్ జ్యూరీ అవార్డ్- అనన్య నాగళ్ల(పొట్టేల్)..
బెస్ట్ లిరిసిస్ట్- చంద్రబోస్ (రాజు యాదవ్), బెస్ట్ సినిమాటోగ్రఫీ - విశ్వనాథ్ రెడ్డి(గామి), బెస్ట్ ఎడిటర్ - నవీన్ నూలి(లక్కీభాస్కర్), బెస్ట్ కొరియోగ్రాఫర్ - గణేశ్ ఆచార్య (దేవర) వంటి చిత్రాల్ని ప్రకటించాయి. అయితే తాజాగా గద్దర్ అవార్డులపై ప్రముఖ దర్శకుడు సుకుమార్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టారు. ‘‘బి. ఎన్. రెడ్డి తెలుగు సినిమా మార్గదర్శకులలో ఒకరు. ఆయన పేరు మీద ఒక అవార్డును ప్రదానం చేయడం ఒక గొప్ప గౌరవం. నా నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు మీ అచంచలమైన మద్దతుకు ధన్యవాదాలు’’ అంటూ సుకుమార్ రాసుకొచ్చారు.






