టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తండ్రికి క్యాన్సర్.. చాలా భయంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తండ్రికి క్యాన్సర్.. చాలా భయంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన బోల్డ్ నటనతో యూత్‌ను ఫిదా చేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘వెంకీ మామ’(Venky Mama), ‘తీస్ మార్ ఖాన్’(Tees Maar Khan), ‘డిస్కో రాజా’(Disco Raja, ‘అనగనగా ఓ అతిథి’(Anaganaga O Athidhi), ‘జిన్నా’(Jinna), ‘రక్షణ’(Rakshana), ‘మంగళవారం’(Mangalavaram) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

అయితే చివరగా యాక్ట్ చేసిన మంగళవారం మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘వెంకట లచ్చిమి’(Venkata Lachchimi) అనే సినిమాలో నటిస్తోంది. డైరెక్టర్ ముని(Muni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏకంగా ఆరు భాషల్లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈ భామ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నా తండ్రి ఎసోఫెగల్ కార్సినోమా(క్యాన్సర్) బారిన పడ్డారు. ఇప్పుడు ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. తొలి కీమో థెరపీ సెషన్‌లోనూ ఆయన పాల్గొన్నారు. దీనివల్ల మాకు కాస్త భయంగా ఉంది. ఆయన త్వరగా కోలుకుంటారని అనుకుంటున్నాము. ఇక దానికి మీ ప్రేమ, సపోర్ట్ కావాలి. అయితే ఇంతబాధలోనూ నన్ను నా పనిచేసుకోమని, షూటింగ్‌కు హాజరవ్వమని చెబుతున్నారు’ అని రాసుకొచ్చింది. అలాగే తన తండ్రికి సెలైన్ ఎక్కిస్తున్న ఫొటోని షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఆమె తండ్రి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story