మెకానిక్‌గా మారిన టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. అయ్యో పాపం ఆఫర్లు లేక ఈ డెసిషన్ తీసుకున్నావా అంటూ కామెంట్స్

by I. Sairam |

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మెకానిక్‌గా మారిన టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. అయ్యో పాపం ఆఫర్లు లేక ఈ డెసిషన్ తీసుకున్నావా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో హాట్ హాట్‌గా కనిపించింది. అంతే కాకుండా మెకానిక్‌గా మారి ఒళ్లంతో మసితో కనిపించింది.

షెడ్‌లో ఉన్న కారును రిపైర్ చేస్తున్నట్లు ఫొటోస్‌కు ఫొజులిచ్చింది. ఇక వీటికి ‘నల్లటి మానసిక స్థితి’ అనే క్యాప్షన్ జోడించి బ్లాక్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో పాపం ఆఫర్లు లేక ఈ డెసిషన్ తీసుకున్నావా అని, హీరోయిన్ నుంచి మెకానిక్‌గా మారిపోయావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story