- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొర్రెలు మేపుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. పాపం ఎంత కష్టం వచ్చిందంటూ నెటిజన్ల కామెంట్స్!
టాలీవుడ్ నటి ధన్య బాలకృష్ణ(Dhanya Balakrishna) 7ఆమ్ అరివు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి ధన్య బాలకృష్ణ(Dhanya Balakrishna) 7ఆమ్ అరివు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు రామ్ పోతినేని ‘నేను శైలజ’ (Nenu Shailaja)మూవీలో కూడా నటించింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘లాల్ సలామ్’ లోనూ ధన్య కీలక పాత్రలో కనిపించింది. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ (Software Sudhir)మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu)లో ఆయనకు ప్రపోజ్ చేసే అమ్మాయిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ అమ్మడు ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోస్ షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ధన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘బాపు’. ఆమని, బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy), అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలైంది. ఈ క్రమంలో.. తాజాగా, ధన్య తన సోషల్ మీడియాలో ద్వారా గొర్రెలు మేపుతున్న వీడియోను షేర్ చేసింది తను నటించి ‘బాపు’ మూవీ చూడాలని ప్రేక్షకులను కోరింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సినిమా కోసం ఎంత కష్టమోచ్చిందని అంటున్నారు. ఇటీవల చిత్రానికి తగ్గట్టు ప్రమోషన్ చేయడం ఓ ట్రెండ్‌గా మారింది. ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సినీ సెలబ్రిటీలు నానా తంటాలు పడుతున్నారు. ఇక ధన్య కూడా అదే ఫాలోవడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






