- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balakrishna: బాలయ్యను ముద్దులతో ముంచెత్తిన టాలీవుడ్ యంగ్ హీరోలు.. తేడానా అంటున్న నెటిజన్లు? (వీడియో)
నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2023లో ‘భగవంత్ కేసరి’(Bhagavanth Kesari) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇక ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 12న థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దుమ్మురేపుతోంది. దీంతో అప్పుడే సక్సెస్ సంబరాలు మొదలైపోయాయి.
బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఈ సక్సెస్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఆవేశం మూవీలో ఫాహద్ పక్కన ఉండే కుర్రాళ్ల మాదిరిగా.. రియల్ లైఫ్‌లో బాలయ్య పక్కన ఈ ఇద్దరు కుర్ర హీరోలు కనిపిస్తున్నారు. అంతేకాకుండా బాలయ్యను ముద్దులతో ముంచెత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇందులో విశ్వక్ సేన్(Vishwak Sen) బాలయ్యకు ముద్దుపెడుతుండగా.. ఆయన కూడా పెట్టారు. ఇక ఈ వీడియో చూసిన వారంతా తేడానా అని అంటున్నారు.






