Tollywood Hero: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఇంత స్పీడ్ గా ఉన్నావేంటయ్యా అంటూ నెటిజన్ల కామెంట్స్

by Phanindra |   (  Updated:2025-01-22 12:58:15  IST  )

ఫొటోలను షేర్‌ చేస్తూ ‘మా ప్రేమ రెండడుగుల మేర పెరుగుతోంది’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు

Tollywood Hero: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఇంత స్పీడ్ గా ఉన్నావేంటయ్యా అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క మూవీ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, ఫ్యాన్స్ కు ట్విట్టర్ వేదికగా గుడ్ న్యూస్ చెప్పాడు.

తాను తండ్రి కాబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. భార్య రహస్య గోరక్ (Rahasya Gorak) బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ ‘మా ప్రేమ రెండడుగుల మేర పెరుగుతోంది’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం, ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఇంత స్పీడ్ గా ఉన్నావేంటయ్యా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

కిరణ్‌ అబ్బవరం – రహస్య గోరక్‌ 2024 ఆగస్టులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) మూవీలో వీరిద్దరూ క‌లిసి న‌టించారు. ఇక మొదటి మూవీతోనే కిరణ్‌, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, చివరకు అదే నిజమయ్యే సరికి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి, పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Next Story