- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో.. అయ్యో ఎంత కష్టపడ్డావ్ బ్రో అంటున్న ఫ్యాన్స్ (వీడియో)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘వెళ్లి పోమాకే’(Vellipomake) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’(Ee nagaraniki emaindhi), ‘ఫలక్‌నుమాదాస్’(Falaknuma Das), ‘హిట్’(HIT), ‘పాగల్’(Pagal), ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’(Ashokavanam Lo Arjuna Kalyanam), ‘ఓరి దేవుడా’(Ori Devuda), ‘ముఖ చిత్రం’(Mukha Chithram), ‘హిట్-2’(Hit-2), ‘దాస్ కా ధమ్కీ’(Das Ka Dhamki), ‘బూ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari), ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.
ప్రస్తుతం ‘లైలా’(Laila), ‘ఫంకీ’(Funkey) వంటి చిత్రాలలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘లైలా’(Laila). ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.
అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా విశ్వక్ ఈ సినిమాలో లేడీ గెటప్‌లో మారేందుకు ఎంత కష్టపడ్డాడో మేకర్స్ మేకింగ్ వీడియో(Making Video)ను రిలీజ్ చేశారు. అందులో క్యారెక్టర్ కోసం ఈ యంగ్ హీరో ఎంత డెడికేషన్ పెట్టాడో తెలుస్తోంది. లైలాగా కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి డెడికేషన్‌గా వర్క్ చేశాడు.
ఫైనల్ లుక్‌లో విశ్వక్‌ను చూసి యూనిట్ మొత్తం చప్పట్లతో అభినందించారు. అయితే అసలు విశ్వక్ గర్ల్‌లా ఎందుకు మారాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలన్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్, నెటిజన్లు అయ్యో ఎంత కష్టపడ్డావ్ బ్రో నిజంగా నీ డెడికేషన్‌కి హ్యాట్స్ఆఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా విశ్వక్ అమ్మాయిలా మారిన వీడియోను చూసేయండి.






