ఆమెకు సీక్రెట్‌గా ఫుడ్ పంపిన టాలీవుడ్ యంగ్ హీరో.. అసలు విషయం చెప్పేసిన బాలయ్య బ్యూటీ (పోస్ట్)

by Mallepaka Hamsa |

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫుడ్ పంపుతాడన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆమెకు సీక్రెట్‌గా ఫుడ్ పంపిన టాలీవుడ్ యంగ్ హీరో.. అసలు విషయం చెప్పేసిన బాలయ్య బ్యూటీ (పోస్ట్)
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫుడ్ పంపుతాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఇంటి భోజనంకు ఎంతోమంది ఫిదా అయిపోయిన వారున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ చాలామంది హీరోయిన్ ఆయన ఫుడ్ గురించి ఇంటర్వ్యూల్లో చెప్తునే ఉంటారు. అయితే ప్రభాస్ ఎంతో అప్యాయతగా సెట్‌లో ఉన్నవారందరికీ ఫుడ్ పెడతాడనే విషయం ఇటీవల ఓ హీరోయిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ఓ హీరోయిన్‌కు సీక్రెట్‌గా ఫుడ్ పంపినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని తెలుపుతూ బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘మీ ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సూపర్ ఫుడ్ యమ్మీగా ఉంది. క్యారెట్ రోటీ, ఆఫ్‌గాన్ చికెన్ చాలా బాగున్నాయి. మొత్తం బాక్స్ నేను కంప్లీట్ చేశాను’’ అని ప్లేట్‌లో ఐటమ్స్ పెట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేయడంతో పాటు హార్ట్ సింబల్ షేర్ చేసింది. ఇక దీనికి ఆయన వెల్‌కమ్ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు అస్సలు ఊహించలేదని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా, ప్రగ్యా జైస్వాల్, సాయి శ్రీనివాస్ కాంబోలో ‘జయ జానకి నాయక’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం యంగ్ హీరో ‘భైరవం’(Bhairavam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఈ మూవీ మల్లీస్టారర్‌గా తెరకెక్కుతోంది. దీనికి విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వం వహించగా.. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ సమర్పిస్తున్నారు. ఇందులో దివ్య పిళ్లై, ఆనంది, అదితి శంకర్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. జయసుధ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అన్ని అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ప్రస్తుతం ‘భైరవం’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Next Story