బంపరాఫర్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఈ బైక్ మీదే అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ఫుల్ హ్యాపీలో ఆడియన్స్

by I. Sairam |   (  Updated:2025-03-02 09:34:46  IST  )

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో అలరించాడు.

బంపరాఫర్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఈ బైక్ మీదే అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ఫుల్ హ్యాపీలో ఆడియన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో అలరించాడు. అయితే అతని ఖాతాలో మంచి హిట్ పడలేవు. కానీ రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం ‘దిల్ రూబా’(dilRuba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వకరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్(Rukshar Thillon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల దిల్ రూబా మూవీ రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మార్చి 14న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకొని మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం ఓ బంపరాఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు.

ఇక కిరణ్ అబ్బవరం ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘దిల్ రూబా ఆల్ అబౌట్ మై లవ్ అండ్ యాంగర్. ఇదిగో మీకు కనిపిస్తుందే ఇదే నా లవ్వు(బైక్). మా ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడి కస్టమైజేషన్ చేశాడు. ఈ బైక్ మీకు మార్కెట్లో దొరకదు. అందుకే ఈ బైక్‌ను మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానే ఇచ్చేద్దామనుకుంటున్నాను. దానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాక దిల్ రూబా నుంచి రిలీజ్ అయిన పాటలు కావొచ్చు, టీజర్ కావొచ్చు, లేకపోతే ఈవెంట్స్‌లో మేము మాట్లాడిన మాటలు కావొచ్చు.. అక్కడే మేము చాలా వరకు లీక్ ఇచ్చేశాం. దిల్ రూబా నుంచి ఏమై ఉండొచ్చు అని, మీరు గెస్ చేయండి. గెస్ ద ప్లాట్ ఆఫ్ దిల్ రూబా .

మోస్ట్ క్రియేటివ్‌గా ఎవరు గెస్ చేస్తారో వాళ్లకి ఈ బైక్‌ని నేనే మీకు ఈ ప్రి రిలీజ్ ఈవెంట్‌‌లో ఇచ్చేస్తాను. అంతేకాదండి నేనే కొంచెం సరదా పడుతున్న ఈ బైక్ మీద ఎవరైతే గెలుచుకుంటారో వారితో ఫస్ట్ డే ఫస్ట్ షో దిల్ రూబాకి కలిసి వెళ్దాం.. మూవీని ఎంజాయ్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం నాకు బాగా నచ్చిన బైకుని మీరు సొంతం చేసుకోండి. అమ్మాయిలు కావొచ్చు, అబ్బాయిలు కావొచ్చు ఎవరైన గెలవచ్చు.. ఓకేనా’ అంటూ బైక్ మోడల్‌ను రివీల్ చేశాడు. ఇక ఈ వీడియోకి నీవే నీవే అనే సాంగ్‌ను యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఆఫర్ విన్న ప్రేక్షకులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం దిల్ రూబా గురించి గెస్ చేయండి బైక్ పట్టండి.

Next Story