- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కింగ్‌స్టోన్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో.. పోస్ట్ వైరల్
కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) వరుస సినిమాల్లో నటిస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే స్టార్ హీరోల చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తూ.. అందరినీ ఫిదా చేస్తున్నారు. అయితే ఇటీవల శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’కు మ్యూజిక్ అందించి హిట్ తన ఖాతాలో వేసుకున్న జీవీ ప్రకాష్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ సాధించారు. ఇక ఇప్పుడు ఆయన చేతిలో 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జీవీ ప్రకాష్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌స్టోన్’(Kingstone). కమల్(Kamal) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పార్లల్ పిక్చర్స్ బ్యానర్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్, బన్‌సాల్ నిర్మిస్తున్నారు. ఈ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కింగ్‌స్టోన్’ సినిమా మార్చి 7వ తేదీన థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయిన మూవీ మేకర్స్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, ‘కింగ్‌స్టోన్’ ప్రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మార్చి 3న 6గంటలకు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుపుతూ ‘రాబిన్‌హుడ్’(Robinhood)కు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు.
The Uber Cool ROBINHOOD @actor_nithiin to be the Chief Guest of #Kingston PRE-RELEASE EVENT 😎
— BA Raju's Team (@baraju_SuperHit) March 2, 2025
📍Park Hyatt, Hyderabad
🗓️March 3rd Tomorrow
⌚6 PM
Event by @MediaYouwe#GV25 pic.twitter.com/u0r12tFa9M






