టాలీవుడ్ స్టార్ సింగర్ ఇంట్లో కరోనా కలకలం.. వైరస్ లక్షణాలు రివీల్ చేస్తూ షాకింగ్ ట్వీట్

by Mallepaka Hamsa |

కరోనా గతంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను గడ గడా వణికించిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ స్టార్ సింగర్ ఇంట్లో కరోనా కలకలం.. వైరస్ లక్షణాలు రివీల్ చేస్తూ షాకింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: కరోనా గతంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను గడ గడా వణికించిన విషయం తెలిసిందే. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ఎంతోమంది వైరల్ బారిన పడటంతో భారత్‌లో లాక్‌డౌన్ కూడా విధించారు. అయితే అప్పుడు చాలా మంది మరణించారు. ఇక కొద్ది రోజు తర్వాత అంతా నార్మల్ అయింది. ఇప్పుడు మరోసారి కరోనా కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనాలు భయపడిపోతున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు(Mahesh Babu) మరదలు శిల్పా శిరోద్కర్‌(Shilpa Shirodkar), ప్రముఖ నటి నికితా దత్తాకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

తాజాగా, టాలీవుడ్ స్టార్ సింగర్ స్మిత (Smitha)తల్లి జోగులాంబ(Jogulamba) కరోనా బారిన పటినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుపుతూ వైరల్ లక్షణాలను ఇలా ఉంటాయని ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ కోవిడ్ వేరియంట్ లక్షణాల గురించి అడిగిన వారికోసం .. ఒక రోజు జ్వరంతో నిద్రలేచాను, రెండవ రోజు తలనొప్పి, మూడవ రోజు గొంతు నొప్పి, నాల్గవ రోజు జలుబు, ఐదవ రోజు కడుపు నొప్పి... ఇలా రోజుకొక కొత్త లక్షణం తో ఈ వేరియంట్ “సకల కళా వల్లభన్” లా ఉంది. ఏ వేరియంట్ అయినా వెళ్ళూ వెళ్తూ విపరీతమైన బలహీనతను వదిలి వెళుతుంది, దాని నుండి బయట పడాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే మాస్కులు బయటకు తీయండి, సురక్షితంగా ఉండండి. కేసుల్లేవు అనేది భ్రమ, ఎవరు టెస్ట్ చేయించుకోవడం లేదు అనేది వాస్తవం’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు ధైర్యం చెబుతున్నారు.

Next Story