- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రైడ్-2’ స్పెషల్ సాంగ్‌లో మెరవనున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. హిట్ ఖాయం అంటున్న నెటిజన్లు (ట్వీట్)
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్(Ajay Devgn) ఇటీవల సింగం, అగైన్, అజాద్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ మెప్పించలేకపోయారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్(Ajay Devgn) ఇటీవల సింగం, అగైన్, అజాద్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ మెప్పించలేకపోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రైడ్-2’. రాజ్ కుమార్ గుప్తా(Raj Kumar Gupta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితేష్ దేశముఖ్(Ritesh Deshmukh), వాణి కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2018లో వచ్చిన ‘రైడ్’కు సీక్వెల్‌గా రాబోతుంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాను పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ‘రైడ్-2’ షూటింగ్ పూర్తి చేసుకోగా మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, అజయ్ దేవ్‌గణ్ ‘రైడ్-2’ స్పెషల్ సాంగ్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నాషా ఏప్రిల్ 10న విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ ఆడిపాడనుంది. అయితే ఇప్పటికే తమన్నా భాటియా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆమె చేసివన్నీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇక ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అంటున్నారు.






