రికార్డు బద్దలు కొట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వరుసగా ఏడు ఫ్లాప్‌లు.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

రికార్డు బద్దలు కొట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వరుసగా ఏడు ఫ్లాప్‌లు.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అంతేకాకుండా తెలుగు, తమిళ, హిందీ స్టార్స్ మహేష్ బాబు(Mahesh Babu), ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, ప్రభాస్(Prabhas), విజయ్ వంటి వారితో నటించి స్టార్ హీరోయిన్‌గా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ అమ్మడుకి గత కొద్ది రోజుల నుంచి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆమె నటించే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండటంతో హిట్ కోసం తాపత్రయపడుతోంది. అయితే అవకాశాలు రాకపోవడంతో ‘కిసికా బాయ్ కిసాకా జాన్’ సినిమా తర్వాత కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ షాహిద్ కపూర్ ‘దేవా’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల పూజా హెగ్డే ‘రెట్రో’(Retro) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సాధించలేకపోయింది.

ప్రస్తుతం పూజా హెగ్డే సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ, దళపతి విజయ్ ‘జననాయగన్’ చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, పూజా హెగ్డే రికార్డు బద్దలు కొట్టి వార్తల్లో నిలిచింది. వరుసగా ఏడు ఫ్లాపులు అందుకుని ట్రోల్స్ ఎదుర్కొంటుంది. కొంతమందికి హీరోయిన్లు 2,3 ఫ్లాపులు సాధించిన విషయం తెలిసిందే.. కానీ పూజా ఏకంగా 7 ఫ్లాప్స్ సొంతం చేసుకున్న మొదటి స్టార్ బ్యూటీగా రికార్డు బద్దలు కొట్టింది. రాదేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్‌కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్, దేవా, రెట్రో వంటి డిజాస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అవి చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.

Next Story