‘రణబాలి’ లుక్‌లో టాలీవుడ్ స్టార్ హీరోస్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్

by I. Sairam |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Rowdy Vijay Devarakonda) కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్(Rahul Sankruthyan) దర్శకత్వంలో వస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్టు ‘రణబాలి’(Ranabali).

‘రణబాలి’ లుక్‌లో టాలీవుడ్ స్టార్ హీరోస్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Rowdy Vijay Devarakonda) కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్(Rahul Sankruthyan) దర్శకత్వంలో వస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్టు ‘రణబాలి’(Ranabali). 1854 నుంచి 1878 మధ్య కాలంలో బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘జయమ్మ’ అనే పాత్రలో నటిస్తుండగా.. హాలీవుడ్ చిత్రం ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ – అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది స్టార్ హీరోలకు సంబంధించిన రణబాలి లుక్ నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, అడివి శేష్, రవితేజ, నాని, నాగ చైతన్యలు రణబాలి లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story