రగ్గడ్ ‌గడ్డంతో మాస్ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో.. సూపర్ అన్నా అంటున్న ఫ్యాన్స్ (పోస్ట్)

by I. Sairam |   (  Updated:2025-02-18 12:17:23  IST  )

నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

రగ్గడ్ ‌గడ్డంతో మాస్ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో..  సూపర్ అన్నా అంటున్న ఫ్యాన్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ మార్కులు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను మెప్పించాడు. రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’(saripoda Sanivaaram) సినిమాతో మన ముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకున్నాడు.

ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా మారి పలు చిత్రాలు చేస్తున్నాడు. అలా చేస్తున్న సినిమాల్లో ‘హిట్-3’(HIT-3) ఒకటి. ఈ మూవీలో నాని హీరోగా అండ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని(Prashanthi Tipirneni) నిర్మిస్తున్నారు. ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి(srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి టాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తుండగా.. మిక్కీ జె. మేయర్(Mickey J Meyer) సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా మే 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కోసం నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడనే సంగతి తెలిసిందే. అంతేకాకుండా అతను నటిస్తోన్న మరో మూవీ ‘ప్యారడైస్‌’(Paradise)లో కూడా వెరైటీ లుక్‌లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాల కోసం నాని తన గెటప్‌ను పూర్తిగా మార్చేశాడు.

తాజాగా జబర్దస్త్ కమెడియన్ ధనా ధన్ ధన్‌రాజ్(Dhanraj) నటించిన ‘రామం రాఘవం’(Ramam Raghavam) సినిమా ట్రైలర్ లాంచ్‌ను రిలీజ్ చేసిన నాని తన లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. రగ్గడ్ గడ్డంతో మాస్ లుక్‌లో దర్శనమిచ్చి షాక్‌కు గురిచేశాడు. అయితే ఇంతకు ముందు నానిని ఈ గెటప్‌లో ఎప్పుడూ చూడకపోవడంతో కొంత మందికి ఈ గెటప్ నచ్చుతుంటే మరికొంత మంది అంతకు ముందే బాగున్నావ్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అతని ఫ్యాన్స్ మాత్రం నువ్వు సూపర్ అన్నా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story