రగ్గడ్ లుక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. ఈ సారి మాస్ జాతర షురూ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

by I. Sairam |

నేచురల్ స్టార్ నాని(Nani) ప్రజెంట్ నటిస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’(The Paradise).

రగ్గడ్ లుక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. ఈ సారి మాస్ జాతర షురూ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) ప్రజెంట్ నటిస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’(The Paradise). దీనికి శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’(Dasara) మూవీ నేషనల్ లెవెల్‌కి ఎదిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్టుపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు. ఇక ఇందులో మోహన్ బాబు, కయాదు లోహార్, రాఘవ జూయల్‌ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కాగా నాని కెరీర్‌లోనే అతిపెద్ద బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీను 2026 మార్చి 26న గ్లోబల్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా నానికు సంబంధించిన లుక్ లీక్ అయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఫొటోలో నాని పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న నేచురల్ స్టార్ ఈ లుక్‌కి అభిమానులు ఫిదా అవుతూ.. ఇది నాని కెరీర్‌లో బెస్ట్ లుక్ ఇదే అని, ఈసారి మాస్ జాతర షురూ అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. కాగా సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Next Story