- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Venu: ‘ఎల్లమ్మ’లో సీనియర్ హీరో..ఇక రచ్చ రచ్చే ?
దేవి శ్రీ ప్రసాద్ పర్శిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు.

దిశ, వెబ్ డెస్క్: బలగం సినిమాతో ఇండస్ట్రీని ఊపేసిన వేణు ఎల్దండి.. ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్నారు. ఆ మూవీనే ఎల్లమ్మ. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో ఎల్లమ్మ దేవతను నిత్యం పూజిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేవత పేరుతోనే ఇప్పుడు వేణు సినిమా తీస్తున్నాడు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వేణు... ఎల్లమ్మ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేశాడట. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. డీఎస్పీని హీరోగా లాంచ్ చేస్తూ ఎల్లమ్మ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రబృందం.
ఇందులో దేవి శ్రీ ప్రసాద్ పర్శిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఆ హీరో ఎవరో కాదు రాజశేఖర్ అంట. ఎల్లమ్మ సినిమాలో రాజశేఖర్ కోసం స్పెషల్ రోల్ సిద్ధం చేశాడట వేణు. ఇందులో తండ్రి పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.
నలుగురు హీరోలను కాదని డీఎస్పీతో మూవీ
ఈ ఎల్లమ్మ కథ కోసం ఏకంగా నలుగురు హీరోలను సంప్రదించాడట వేణు. మొదట నితిన్ పేరు వినిపించగా, ఆ తర్వాత నాని కూడా ఈ సినిమాను వదులుకున్నారట. బెల్లంకొండ శ్రీనివాస్, శర్వానంద్ లాంటి హీరోలను కూడా సంప్రదించగా వాళ్ళందరూ రిజెక్ట్ చేశారని టాక్. దీంతో దేవిశ్రీప్రసాద్ అనే హీరోగా లాంచ్ చేస్తున్నాడు వేణు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read More..






