- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘VT-15’కు క్రేజీ టైటిల్ ఫిక్స్.. షాకింగ్ పోస్టర్ విడుదల చేసిన మూవీ మేకర్స్
సరైన హిట్ లేక ఎన్నో ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej).

దిశ, వెబ్‌డెస్క్: సరైన హిట్ లేక ఎన్నో ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej). ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీటీ-15’(VT-15). మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ రితికా నాయక్(Rithika Nayak) హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవ్వగా.. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాకుండా ‘కనకరాజు వచ్చేసినాడమ్మీ’ అంటూ రాసుకొస్తూ ఓ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా ‘కొరియన్ కనకరాజు’ టైటిల్‌తో తెరకెక్కుతున్నట్లు తెలిపారు. ఇందులో హీరో వరుణ్ తేజ్ కనకరాజుగా కనిపించనున్నారు. ఇక గ్లింప్స్‌లో ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ వరుణ్ తేజ్ కొరియన్ భాషలో చెప్పడం ఆసక్తిగా మారింది. కాగా ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కానుంది.






