టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత.. నెలరోజుల క్రితమే కొడుకు మృతి

by Naga Rani Yarlagadda |

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 350కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కలకోట రఘునాథరెడ్డి (56) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత.. నెలరోజుల క్రితమే కొడుకు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 350కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కలకోట రఘునాథరెడ్డి (56) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శనివారం (జనవరి 31) రాత్రి గుండెపోటుతో కన్నుమూశారని తెలిపారు. నెలరోజుల క్రితమే ఆయన కొడుకు కూడా గుండెపోటుతోనే చనిపోవడం గమనార్హం. కుమారుడిని కోల్పోయిన బాధతోనే ఆయన దీర్ఘఆలోచనలో పడ్డారని, ఆ ఆవేదనతోనే గుండెపోటుకు గురై మరణించినట్లు తెలుస్తోంది. 1970, జనవరి 1న జన్మించిన రఘునాథరెడ్డి ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడ నివాసి.

ఆయన భౌతిక కాయానికి నటి శివపార్వతి నివాళులు అర్పించారు. సీనియర్ నటుడు, ఎన్నో సహాయపాత్రలు చేసిన వ్యక్తి మరణిస్తే టాలీవుడ్ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రఘునాథరెడ్డి కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం, భద్ర తదితర సినిమాల్లో నటించారు. శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం సినిమాతో ఆయన ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యారు. రఘునాథరెడ్డి చివరిగా 2018లో సుమంత్ హీరోగా చేసిన సుబ్రహ్మణ్యపురంలో నటించారు.

Next Story