మరోసారి దొరికిపోయిన టాలీవుడ్ రూమర్ కపుల్.. ఫిక్స్ అయిపోయామంటూ నెటిజన్ల కామెంట్స్

by I. Sairam |

టాలీవుడ్ రూమర్ కపుల్ రష్మిక మందన్న(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

మరోసారి దొరికిపోయిన టాలీవుడ్ రూమర్ కపుల్.. ఫిక్స్ అయిపోయామంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రూమర్ కపుల్ రష్మిక మందన్న(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ‘గీత గోవిందం’(Geetha Govindam), ‘డియర్ కామ్రేడ్’(Dear Comrade) వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఆన్ స్క్రీన్ వీళ్ల కెమిస్ట్రీ నచ్చిన ఆడియన్స్ రియల్ లైఫ్‌లో కూడా ఓ కపుల్ అవ్వాలని కోరుకున్నారు. వారు అనుకున్నట్లే ఈ జంట సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అంతేకాదోండోయ్ వీరిద్దరు ఎన్నో చార్లు కలిసి వేకేషన్స్‌కు వెళ్లడం, అక్కడ వీరి ఫొటోస్ మీడియాకు చిక్కడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది.

కానీ వీరిద్దరి రిలేషన్‌పై ఈ జంట ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమంలో వీరిద్దరు మరోసారి జంటగా కనిపించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్‌(Newyork)లో నిర్వహించిన 43వ వార్షిక ఇండియా డే పరేడ్ గ్రాండ్‌గా జరిగింది. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ ఉత్సవాలుగా జరుపుకునే క్ర‌మంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రతి సంవత్సరం ఈ పరేడ్‌ను నిర్వహిస్తూ వ‌స్తుంది. భారత 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో అతి పెద్ద భారతీయ పరేడ్ అయిన “ఇండియా డే పరేడ్”(India Day Parade) అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు వేలాదిమంది భారతీయ అమెరికన్లు, విదేశీ స్నేహితులు హాజరయ్యారు. అలాగే ప్రముఖ సినీ తారలు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ 2025 సంవత్సరానికి గాను “గ్రాండ్ మార్షల్స్”గా హాజరై పరేడ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఇంకా మీరేమి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఫిక్స్ అయిపోయామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Link

Next Story