రాయలసీమలో పీకల్లోతూ అప్పులు చేసిన టాలీవుడ్ నిర్మాత ?

by velandi.Saikiran |

అప్పులు చేయాల్సి వచ్చిందని.. తాజాగా శ్రీనివాస్ కుమార్ నాయుడు వెల్లడించారు. రాయలసీమలో అప్పులు చేసినట్లు వివరించారు.

రాయలసీమలో పీకల్లోతూ అప్పులు చేసిన టాలీవుడ్ నిర్మాత ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది నిర్మాతలు సక్సెస్ అవుతుంటే.. మరికొంతమంది నిర్మాతలు సక్సెస్ కావడానికి చాలా కష్టపడుతున్నారు. ఇక మరికొంతమంది సినిమాలు తీసి అప్పలపాలైన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా.. అప్పుల పాలైన నిర్మాతల లిస్టులోకి SKN కూడా చేరిపోయారు.

నిర్మాత అప్పులు తీసుకువచ్చి సినిమాలు చేయడం చాలా కామన్. ఆ తర్వాత సినిమా హిట్ అయిన డబ్బులు వస్తే... అప్పులు తీర్చుకుంటాడు. అయితే ఒకానొక సమయంలో అప్పులు చేయాల్సి వచ్చిందని.. తాజాగా శ్రీనివాస్ కుమార్ నాయుడు వెల్లడించారు. అది కూడా రాయలసీమలో తనకు తెలిసిన వారి దగ్గర... అప్పులు చేసినట్లు వివరించారు.

ఇందులో కొన్ని తీర్చానని.. మరికొన్ని తీర్చాల్సి ఉందని ఆయన చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉండగా... ఆయన ఇప్పటివరకు 19 సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఏడు రిలీజ్ కావాల్సి ఉండగా... 12 రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాకు కూడా ఆయన పని చేస్తున్నారు. గతంలో బేబీ సినిమాతో సంచలనాన్ని సృష్టించారు SKN.

Next Story