- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్లు ఇవ్వకపోతే 200 సార్లు చెబుతా.. బడా నిర్మాతలకు ఎస్‌కేఎన్ వార్నింగ్
టాలీవుడ్ బడా నిర్మాతలకు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్క థియేటర్ ఇస్తే వందసార్లు చెప్పుకుంటానని, ఒక్క థియేటర్ ఇవ్వకపోతే రెండు వందల సార్లు చెబుతానని అది తన నైజం అని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ బడా నిర్మాతలకు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్క థియేటర్ ఇస్తే వందసార్లు చెప్పుకుంటానని, ఒక్క థియేటర్ ఇవ్వకపోతే రెండు వందల సార్లు చెబుతానని అది తన నైజం అని వ్యాఖ్యానించారు. రాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పండగకు విడుదల అవుతున్న అన్ని సినిమాలు మంచి విజయం సాధించాలని అన్నారు. పండగకు అన్ని సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్ల సమస్య వస్తుందన్నారు.
రాజాసాబ్ నిర్మాత విశ్వప్రసాద్ నిర్మించిన మిరాయ్ సినిమా మంచిగా ఆడుతున్న ఓజీ సినిమాకు థియేటర్లను ఇచ్చారన్నారు. కాబట్టి అలాంటి విశ్వప్రసాద్ నిర్మించిన, ప్రభాస్ నటించిన సినిమా వస్తున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అందరూ సహకరించాలన్నారు. అలా సహకరించినవాళ్ల పేర్లు సినిమా విడుదల తరవాత ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని అన్నారు. ఒక్క థియేటర్ ఇస్తే వందసార్లు చెప్పుకుంటానని, ఒక్క థియేటర్ ఇవ్వకపోతే రెండు వందల సార్లు చెబుతానని అది తన నైజం అని వ్యాఖ్యానించారు. అంటే తన వ్యాఖ్యలతో ఎస్కేఎన్ ఇన్ డైరెక్ట్ గా థియేటర్లకు ఇవ్వకపోతే వాళ్ల పేర్లు బహిరంగంగా చెబుతానని హెచ్చరించారు.






