- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో ట్రోలింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ నిర్మాత
సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నారని టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. తనపై ట్రోలింగ్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నారని టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. తనపై ట్రోలింగ్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను నిర్మించిన సినిమాను, అందులో నటించిన నటీనటులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని సోషల్ మీడియా పేజీలు, ఛానళ్లు చేస్తున్న ప్రచారం ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, ఇలాంటి దురుద్దేశపూరిత పోస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దర్యాప్తులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన రాజాసాబ్ సినిమా ఈవెంట్ లో రాజాసాబ్ చూసి తనకు గూస్ బంప్స్ వచ్చాయని అన్నారు. ప్రతి సంక్రాంతికి కోళ్లపై పందెం వేస్తారని ఈ సంక్రాంతికి డైనోసార్ పై వేయండని అన్నారు. అంతేకాకుండా దర్శకుడు మారుతిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎస్కేఎన్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే రాజాసాబ్ కు నెగిటివ్ టాక్ రావడంతో ఆయనపై, డైరెక్టర్ మారుతిపై దారుణమైన ట్రోలింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ట్రోలింగ్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.






