‘మీ లాంటి భార్య దొరకడం అతని అదృష్టం’.. టాలీవుడ్ హీరో భార్యపై నెట్టింట ప్రశంసలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-25 13:36:41  IST  )

టాలీవుడ్(Tollywood) హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) సినిమాలకు గ్యాప్ ఇచ్చి టీవీ షోలపై ఫోకస్ పెట్టారు.

‘మీ లాంటి భార్య దొరకడం అతని అదృష్టం’.. టాలీవుడ్ హీరో భార్యపై నెట్టింట ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) సినిమాలకు గ్యాప్ ఇచ్చి టీవీ షోలపై ఫోకస్ పెట్టారు. చివరగా ఆయన విరాటపర్వం అనే సినిమాలో హీరోగా నటించారు. అప్పటినుంచి మళ్లీ హీరోగా పూర్తి స్థాయి సినిమా చేయ‌లేదు. ప్రస్తుతం ‘ద రానా దగ్గుబాటి షో’కు హోస్ట్‌గా చేస్తున్నారు. ఇటీవల విడుదలైన డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రబృందాలతో క్రేజీ ఇంటర్వ్యూలు నిర్వహించి నెట్టింట ట్రెండ్ అయ్యారు. ఇదిలా ఉండగా.. తాజాగా రానా భార్య మిహికా బజాజ్(Miheeka Bajaj) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. వీకెండ్ ట్రిప్‌కు సంబంధించిన నాలుగైదు ఫొటోలు పెట్టారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.


‘మీ లాంటి భార్య దొరికినందుకు రానా అన్న చాలా అదృష్టవంతుడు’ అంటూ నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మిహికా మేడం డెస్సింగ్ సెన్స్ బావుందని.. ఇలాగే మెయింటైన్ చేయండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా వీరిద్దరూ 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నారు. రానా ఓవైపు నిర్మాతగా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ.. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రెజెంట్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'వేట్టైయన్' మూవీలో నటించారు. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది.

Next Story