- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ హీరో సెక్స్ ఎడ్యుకేషన్ వెబ్ సిరీస్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) ‘స్నేహ గీతం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీతో ఫేమ్ తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) ‘స్నేహ గీతం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీతో ఫేమ్ తెచ్చుకున్నాడు. వరుస సినిమాలు చేసినప్పటికీ అన్ని సాలిడ్ హిట్‌గానే నిలిచాయి. 2023లో ఆయన ‘ఊరు పేరు భైరవకోన’(Ooru Peru Bhairavakona) మూవీతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఇక గత ఏడాది తమిళ స్టార్ హీరో ధనుష్ రాయన్, కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సందీప్ కిషన్ ‘మాజాకా’ (Mazaka)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
త్రినాథరావు నక్కిన(Trinath Rao Nakkina) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని హాస్య మూవీస్ , ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments) బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. అయితే ఇందులో అన్షు అంబాని, రితూ వర్మ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సందీప్ కిషన్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న మొదటి తెలుగు వెబ్ సిరీస్ ఇదే అని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియోను షేర్ చేసింది.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’(Super Subbu) హక్కులను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ను చిలక ఇక ఇందులో హీరో అన్ని వదిలేసి జాబ్ చేయడానికి వెల్లగా.. బ్రహ్మానందం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలని అంటారు. దీంతో షాక్ అయిన హీరో లేచి నిల్చుంటాడు. ఆ తర్వాత తన లవర్, తల్లిదండ్రులను గుర్తు చేసుకుని చేస్తాను అని అంటాడు. ఎక్కడ చేయాలని అడగ్గా.. ఆ ఊర్లో పాస్ పోసినంత ఇజీగా పిల్లలను కంటారు అని ఆది చెప్తాడు. ఆ తర్వాత ఆయనను ఓ చెట్టుకు కట్టేసినట్లుగా చూపిస్తారు. దీంతో షాక్ అయిన హీరో మాకీపూర్ అని గట్టిగా అరుస్తాడు. అంతటితో వీడియో అయిపోతుంది. అయితే నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. త్వరలో రాబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






