Pawan Kalyan: ‘ఓజి’ సినిమాలో కీలక పాత్ర చేయనున్న టాలీవుడ్ హీరోకు కాబోయే భార్య.. పోస్ట్ చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-28 13:00:03  IST  )

పవర్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

Pawan Kalyan: ‘ఓజి’ సినిమాలో కీలక పాత్ర చేయనున్న టాలీవుడ్ హీరోకు కాబోయే భార్య.. పోస్ట్ చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: పవర్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్, సుజిత్(Sujith) కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఓజి’ (OG)మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీనిని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ఓజీ’ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఓజీ’లో టాలీవుడ్ హీరోకు కాబోయే భార్య కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. నారా రోహిత్‌‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శిరీష,(shirisha) పవన్ మూవీలో భాగం కానుందట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా.. శిరిష ‘ప్రతినిధి-2’ సినిమాలో నారా రోహిత్ సరసన నటించింది. ఈ సమయంలోనే ఇద్దరి ప్రేమ చిగురించడంతో పెద్దలను ఒప్పించి ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఇక నారా రోహిత్ సినిమాలతో బిజీగా ఉండటంతో పెళ్లి డేట్ ప్రకటించలేదు. ఇక ఇప్పుడు నటనపై ఆసక్తితో శిరిష కూడా పలు కథలు వింటున్నట్లు టాక్.

Next Story