గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ ఇషితా దత్తా(Ishita Dutta) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఇషితా దత్తా(Ishita Dutta) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘చాణక్యుడు’(Chanakyudu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’(Adipurush) మూవీలోనూ కీలక పాత్రలో నటించి మెప్పించింది. కానీ అమ్మడుకి అనుకున్నంత పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ దృశ్యం-1, దృశ్యం-2(Drushyam -2),ఫిరంగి(Firangi), బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇషితా వత్సల్ సేత్‌ను(Vatsal Seth) పెళ్లి చేసుకుంది. ‘రిష్టన్ కా సౌదాగర్ బాజీగర్’ సీరియల్ ద్వారా ప్రేమలో పడిన వీరిద్దరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. అయితే ఈ జంట 2023లో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇషిత, వత్సల్ గుడ్ న్యూస్ ప్రకటించారు. తాము రెండుసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘9 ఏళ్ల పరిచయం ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story