- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ నటుడితో ఏడడుగులు వేసిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లిలోనే ఆ పని చేసి షాకిచ్చిందిగా! (పోస్ట్)
ప్రముఖ మోడల్ ప్రియా బెనర్జీ(Priya Banerjee) 2013లో ‘కిస్’(Kiss) సినిమాతో టాలీవుడ్ ఇండస్టీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: ప్రముఖ మోడల్ ప్రియా బెనర్జీ(Priya Banerjee) 2013లో ‘కిస్’(Kiss) సినిమాతో టాలీవుడ్ ఇండస్టీకి పరిచయం అయింది. అడివి శేష్Adivi Sesh) హీరోగా నటించిన ఈ చిత్రం హిట్ అందుకోలేనప్పటికీ ప్రేక్షకులను మాత్రం అలరించింది. ఇక ఆ తర్వాత ప్రియా సందీప్ కిషన్ ‘జోరు’(Joru)మూవీలోనూ నటించి తన అందం, నటనతో మెప్పించింది. ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. చేసింది తక్కువ ప్రాజెక్ట్స్ అయినప్పటికీ ప్రియా తన అందంతో అందరినీ కట్టిపడేసింది.
2023లో రానా నాయుడు వెబ్ సిరీస్‌లోనూ నటించింది. కానీ ఈ అమ్మడు తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. అలాగే సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఎంతోమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ప్రియా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ యంగ్ బ్యూటీ గత కొద్ది కాలం నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో డేటింగ్ చేసింది. పెద్దలను ఒప్పించి ఫిబ్రవరి 14న వీరిద్దరు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ పెళ్లిలో ప్రతీక్ మండపానికి వచ్చి ఆచారాల కోసం తన పక్కన కూర్చోవడంతో అది చూసిన ప్రియా ఎమోషనల్ అయిపోయింది.
ఆ తర్వాత పెళ్లిలోనే రెచ్చిపోయిన ఈ జంట మండపంలోనే లిప్ లాక్ ఇచ్చుకున్నారు. దీంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అందరిముందే అలా చేసిందేంటి అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక వివాహానికి సంబంధించిన ఫొటోలను ప్రియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ‘‘నా జీవిత కాలం మొత్తం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక ప్రియా భర్త ప్రతీక్ విషయానికొస్తే.. ప్రతీక్ రాజ్ బబ్బర్, దివంగత నటి స్మితాపాటిల్ దంపతుల కొడుకు. అయితే స్మితా ప్రసవ సమస్యల కారణంగా మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతీక్, ప్రియా పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. అవి చూసిన వారు కొందరు ఆశ్చర్యపోతున్నారు.






