ట్రెడిషనల్ వేర్‌లో బాపు బొమ్మలా రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు అచ్చతెలుగింటి కోడలిలా ఉన్నావంటూ కామెంట్స్

by I. Sairam |

సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

ట్రెడిషనల్ వేర్‌లో బాపు బొమ్మలా రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు అచ్చతెలుగింటి కోడలిలా ఉన్నావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది. అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం లావణ్య ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటిస్తోంది.

మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్(Dev Mohan) ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్షన్ నెం.1 చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి తాతినేని స‌త్య(Tatineni Sathya) దర్శకత్వం వహిస్తుండగా.. నాగమోహ‌న్ బాబు.ఎమ్‌(M. Mohanbabu), రాజేష్‌.టి(T. Rajesh) నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(social Medai)లో యాక్టీవ్‌గా ఉంటూ తన భర్తతో వేకేషన్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన ఫొటోలతో పాటు తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. నిన్న ఉగాది స్పెషల్‌గా ఈ బ్యూటీ అచ్చతెలుగు ఆడపిల్లలా చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, నుదుటున పెట్టు పెట్టుకుని దర్శనమిచ్చింది.

ఇక ఆ ఫొటోలకు ఎల్లో కలర్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఇప్పుడు అచ్చతెలుగింటి కోడలిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ భామ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి. కాగా మెగా ఫ్యామిలీ తెలుగు వారు అన్న సంగతి తెలిసిందే.

Next Story