ప్రియుడితో రెండో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నామంటూ పోస్ట్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరోయిన్ పావని రెడ్డి(Pavani Reddy) అందరికీ సుపరిచితమే. కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లితెరపై అనేక సీరియల్స్‌లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది.

ప్రియుడితో రెండో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నామంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ పావని రెడ్డి(Pavani Reddy) అందరికీ సుపరిచితమే. కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లితెరపై అనేక సీరియల్స్‌లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ పాపులారిటీతో సినిమాల్లో నటించే చాన్స్ కూడా కొట్టేసింది. అలా టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ మెప్పిస్తుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ ముద్దుగుమ్మ తెలుగు నటుడు ప్రదీప్‌కుమార్‌(Pradeep Kumar)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరిగ్గా ప్రేమికుల రోజే ఈ వివాహం జరిగింది.

అయితే సడన్‌గా ఏమైందో ఏమో కానీ 2017లో ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని పుప్పాల గూడలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించాడు. అప్పట్లో ఈ సంఘటన టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. పావని రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఆమె మరొకరితో చనువుగా ఉండటం వల్లే ప్రదీప్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రచారం జరిగింది. ఈ విషాదం తర్వాత పావని నిర్మాత ఆనంద్‌జాయ్‌ను పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే అది వాస్తవం కాదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు.

ఈ క్రమంలో ఈ భామ పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది. పావని రెడ్డి మళ్లీ పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానోచ్‌. ఒకరికొకరు తోడుంటామని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నాం. ఇకపై కలిసి జీవిద్దాం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. ఈనెల 20న ప్రముఖ కొరియోగ్రాఫర్ అమిర్‌(amir)తో ఏడడుగులు నడవనున్నట్లు ఈ పోస్ట్‌లో పేర్కొందీ అందాల తార. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక దీన్ని చూసిన నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పావని, అమిర్‌లకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా తమిళ బిగ్‌బాస్‌(Tamil Bigg Boss) ఐదో సీజన్‌లో పాల్గొన్న పావని రెడ్డి సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఇదే సమయంలో ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ ఆమిర్‌తో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ రూమర్లను నిజం చేస్తూ రెండో పెళ్లికి సిద్ధమైంది పావని రెడ్డి.

Next Story