క్లీన్ బోల్డ్‌ షోతో రచ్చ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. చలికాలంలో బాడీలో హీట్ పెంచేస్తున్నావంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

క్లీన్ బోల్డ్‌ షోతో రచ్చ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. చలికాలంలో బాడీలో హీట్ పెంచేస్తున్నావంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఒక లైలా కోసం'(Oka Laila Kosam) అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన మొదటి సినిమాతోనే అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురంలో’(Ala Vaikuntapuramlo) నటించి బుట్ట బొమ్మగా పాపులారిటీ అయింది. అయితే ఈ సినిమా తర్వాత నటించిన అన్ని సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడంతో ఐరన్ లెగ్‌ అనే బిరుదు తెచ్చుకుంది.

అంతేకాకుండా సినిమా ఆఫర్లు కూడా రాకుండా పోయాయి. దీంతో గత రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరం అయి.. సోషల్ మీడియాకే పరిమిత అయింది. కానీ ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఫామ్ ‌లోకి వస్తుంది. ఇందులో భాగంగా పూజా ప్రజెంట్ స్టార్ హీరో విజయ్ దళపతి(Vijay Dalapathi) 69 మూవీ ‘జన నాయగన్’(Jananayagan) సినిమాలో హీరోయిన్‌గా అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే మరొకవైపు సూర్య(Surya) సరసన ‘రెట్రో’(Retro) మూవీతో పాటు ‘కాంచన 4’(Kanchana) వంటి సినిమాలతో బిజీ బిజీగా ఉంది. కాగా ప్రజెంట్ ఈ భామ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor) హీరోగా నటించిన ‘దేవా’(Deva) సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం జనవరి 31న విడుదల కాబోతోంది.

ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా(Social Media) లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా పూజా హెగ్డే సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ డ్రెస్‌లో క్లీన్ బోల్డ్ షో చేస్తూ ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు చలికాలంలో బాడీలో హీట్ పెంచేస్తున్నావు బుట్టబొమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ ఫొటోస్‌పై ఓ లుక్ వేసేయండి.

Next Story