ఆ స్టార్ హీరో పై మనసు పడ్డ టాలీవుడ్ హీరోయిన్.. అతనంటే నాకు పిచ్చి అంటూ బోల్డ్ కామెంట్స్

by I. Sairam |

అలనాటి స్టార్ హీరోయిన్ స్నేహ(Sneha) మనందరికీ సుపరిచితమే.

ఆ స్టార్ హీరో పై మనసు పడ్డ టాలీవుడ్ హీరోయిన్.. అతనంటే నాకు పిచ్చి అంటూ బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ స్నేహ(Sneha) మనందరికీ సుపరిచితమే. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్‌టైన్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ఓవర్‌గా ఎక్స్‌పోజింగ్ చేయకుండా హోమ్లీ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది. అలా దాదాపు అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది. ఇక అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘s/o సత్యమూర్తి’, రామ్ చరణ్(Ram Charan) హీరోగా చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో సహయక పాత్రల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా దళపతి విజయ్(Vijay) హీరోగా నటించిన ‘గోట్’(Goat) సినిమాలో ఆయన భార్యగా చేసి ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ హీరో అజిత్(Ajith) పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. తన ఫేవరెట్ హీరో ఎవరు అనే దానికి సమాధానం చెప్పారు. ‘నాకు అందరి హీరోలలో స్టార్ హీరో అజిత్ అంటే చాలా ఇష్టం. అతని సినిమాలను ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తాను. నిజం చెప్పాలంటే అతనంటే నాకు పిచ్చి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నేహ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Ajith Kumar Instagram Link

Sneha Instagram Link

Next Story