- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుదైన సమస్యతో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..
అలనాటి హీరోయిన్ లైలా(Laila) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అప్పట్లో ఓ ఊపు ఊపిన ఈ బ్యూటీ తర్వాత కాలంలో కనిపించకుండా పోయింది.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి హీరోయిన్ లైలా(Laila) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అప్పట్లో ఓ ఊపు ఊపిన ఈ బ్యూటీ తర్వాత కాలంలో కనిపించకుండా పోయింది. శ్రీకాంత్(Srikanth), వెంకటేష్(Venkatesh) వంటి సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించింది. అంతేకాకుండా తన క్యూట్ స్మైల్‌తో అభిమానులను సొతం చేసుకుంది. అలా ఈ అందాల తార తెలుగు, హిందీ తమిళ్ మలయాళం అలాగే కన్నడ భాషల్లో సినిమాలు తీసింది. తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయింది ఈ బ్యూటీ.
‘ఎగిరే పావురమా’(Yegire Pavurama), ‘ఉగాది’(Ugadi), ‘పెళ్లి చేసుకుందాం’(Pelli Chesukundam), ‘ఖైదీగారు’(Khaidi Garu), ‘పవిత్ర ప్రేమ’(Pavitra Prema), ‘శుభలేఖలు’(Shubhalekhalu) అలాగే ‘లవ్ స్టోరీ’(Love Story) లాంటి ఎన్నో సినిమాలు చేసింది లైలా. అయితే గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ.. 2022 లో కార్తీ(Karthi) నటించిన ‘సర్దార్’(Sardaar) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక గతేడాది విజయ్ ‘ది గోట్’ చిత్రంలో నటించింది.
అలాగే ఇటీవల విడుదలైన ఆది పినిశెట్టి సినిమా ‘శబ్ధం’ లోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది లైలా. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. లైలా పాత్ర కు కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకున్న వింత అనారోగ్య సమస్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ఓ కొత్త సమస్య ఉంది. అయితే ఆ వింత సమస్య కేవలం నాకు మాత్రమే వచ్చింది. ఇంతకీ అదేమిటంటే.. నేను నవ్వకుండా ఉండలేను.... నవ్వు ఆపేస్తే కన్నీళ్లు వస్తాయి.
ఇది ఒక జబ్బు అని డాక్టర్లు తెలిపారు. అయితే ‘శివ పుత్రుడు’ సినిమా సమయంలో.. నవ్వకుండా ఒక నిమిషం పాటు ఉండాలని... హీరో విక్రమ్ చాలెంజ్ చేశాడు. కానీ నేను నవ్వకుండా... 30 సెకండ్లు కూడా ఉండలేక దారుణంగా ఏడ్చేశాను. ఈ తరుణంలోనే నా మేకప్ మొత్తం చెడిపోయింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లైలా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇలాంటి వింత వ్యాధి గురించి తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.






