Raashi Khanna:‘ఈ అవార్డును మీకు అంకితం చేస్తున్నాను’.. టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-03-04 13:26:50  IST  )

టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా (Rashi Khanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Raashi Khanna:‘ఈ అవార్డును మీకు అంకితం చేస్తున్నాను’.. టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా (Rashi Khanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఊహాలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి.. తొలి చిత్రంతోనే మంచి పేరు దక్కించుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసింది.

రాశీ ఖన్నా బెంగాల్ టైగర్(Bengal Tiger), సుప్రీమ్, జై లవ కుశ (Jai Lava Kusa), తొలి ప్రేమ, ఇమైక్కా నొడిగళ్ (Imaikka Nodigal), వెంకీ మామ , ప్రతి రోజు పండగే, సర్దార్‌మామ, తిరుచిత్రాంబళం (Tirucitrāmbaḷaṁ) వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది.

తెలుగు అండ్ తమిళ సినిమాలలో ప్రముఖ నటీమణులలో ఒకరిగా స్థిరపడింది ఈ బ్యూటీ. ఈమె పలు భాషల్లో కొన్ని పాటలు కూడా పాడారు. అలాగే స్ట్రీమింగ్ సిరీస్ రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్, ఫర్జీ (Pharji) లో కూడా నటించింది .

షూజిత్ సిర్కార్ (Shoojit Sircar) దర్శకత్వం వహించిన హిందీ పొలిటికల్ స్పై థ్రిల్లర్ సినిమా మద్రాస్ కేఫ్‌లో సైడ్ క్యారెక్టర్ రోల్‌తో తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అధికారి భార్య రూబీ సింగ్‌(Ruby Singh)గా కనిపించి జనాల్ని ఆకట్టుకుంది. మద్రాస్ కేఫ్ చిత్రం ఏకంగా రూ. 67 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

ఈ మూవీకి ఉత్తమ నటిగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్స్డ్‌(Guild Film Awarded)లో నామినేట్ అయ్యింది. మొదటి చిత్రం ఊహాలు గుసగుసలాడే సినిమాకు కూడా 4 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు, జీ తెలుగు అప్సర అవార్డులు (Zee Telugu Apsara Awards), సినిమా అవార్డులు, జీ సినీ అవార్డ్స్ తెలుగు (Zee Cine Awards Telugu) వంటి అవార్డులు ఎన్నో ఉత్తమ నటిగా ఎన్నో సొంతం చేసుకుంది.

అయితే రాశీ ఖన్నా నటించిన అరణ్మనై (Aranmanai) చిత్రానికి రీసెంట్‌గా అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాశీ ఖన్నా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘అరణ్మనై సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నందుకు చాలా గౌరవంగా ఉంది. అద్భుతమైన డైరెక్టర్ సుందర్ అలాగే ఈ సక్సెస్ వెనకున్న శక్తిమంతుడైన ఖుష్‌సుందర్ కు మాటల్లో చెప్పలేని కృతజ్జతలు.

ప్రస్తుతం తమన్నా నా పక్కన తమన్నా లేకపోవడం ఈ క్షణం అసంపూర్ణంగా అనిపిస్తుంది. అలాగే అభిమానులు అంతులేని ప్రేమకు, మద్ధతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డును మీకు అంకితం చేస్తున్నాను’’ అంటూ నటి రాశీ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Next Story