- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండోసారి ప్రెగ్నెంట్ అయిన టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటో వైరలవ్వడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా(Ileana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా(Ileana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘దేవదాసు’(Devadasu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఓ ఊపు ఊపేసింది. అలా కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. అయితే సడెన్‌గా ఏమైందో ఏమో కానీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. ‘అమర్ అక్బర్ ఆంటోని’(Amar Akbar Anthony) మూవీలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాలకు దూరం అయింది.
ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మైఖేల్ డోలన్ అనే విదేశీయుడితో డేటింగ్‌లో ఉన్న ఇలియానా 2023లో ఓ బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన బాబుకు ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్లు, తన ఫొటోలు కూడా షేర్ చేసి తెలిపింది. దీంతో ఆ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తుంది.
తాజాగా ఇలియానా ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఇద్దరూ బేబీ బంప్స్‌తో ఉన్నారు. ఈ ఫొటో షేర్ చేసి ఇలియానా.. బంప్ బడ్డీస్ అని రాసుకొచ్చింది. దీంతో త్వరలోనే ఇలియానా రెండోసారి తల్లి కాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. పలువురు అభిమానులు, నెటిజన్లు ఈ సందర్భంగా ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






