- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బులు లేక Parle- G బిస్కెట్లు తింటున్న టాలీవుడ్ హీరోయిన్ !
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే పాపులరై... దూసుకు వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది మంచి మంచి సినిమాలు చేసి ఆ తర్వాత డీలా పడిపోతూ ఉంటారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఇప్పుడు.. చేతిలో సినిమాలు లేకుండా సతమతమవుతున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు.
అలా వైకుంఠపురం సినిమాలో మెరిసిన తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు పూజా హెగ్డే. బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే తమిళ్ ఇండస్ట్రీలో.. అడపాదడపా ఛాన్సులు వస్తున్నాయి. కానీ పెద్ద హీరో సినిమాలో మాత్రం చాన్సులు దక్కించుకోలేకపోతోంది ఈ బ్యూటీ. అయితే అలాంటి హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు సంచలన వీడియో పంచుకుంది. పార్లేజీ బిస్కెట్ ను చాయిలో... వేసుకొని తింటూ కనిపించింది పూజ హెగ్డే.
సింపుల్ లైఫ్... చాయ్ తో బిస్కెట్ అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ సింపుల్ లైఫ్ తోనే తనకు ఆనందంగా ఉందని.. పేర్కొంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజెన్స్... రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాపం పూజా హెగ్డే చేతిలో సినిమాలు లేక పార్లేజి బిస్కెట్ తినాల్సిన పరిస్థితి వచ్చిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ పరిస్థితి చూసైనా.. ఎవరో ఒకరు ఆమెకు మళ్ళీ లైఫ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా పూజా హెగ్డే... ఆచార్య తరువాత తెలుగు సినిమాలే చేయలేదు.






