ట్రెడిషనల్ వేర్‌లో సూపర్ అనిపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. మహాలక్ష్మిలా ఉన్నావంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-07-09 13:31:35  IST  )

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ట్రెడిషనల్ వేర్‌లో సూపర్ అనిపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. మహాలక్ష్మిలా ఉన్నావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. అయితే రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఈ ముద్దుగుమ్మ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పర్పుల్ కలర్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుంది. అలాగే సింపుల్‌గా చేతికి ఒక్కో బ్యాంగిల్ వేసుకుని వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ మహాలక్ష్మిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి. Link

Next Story