- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ డ్రెస్‌లో మతిపోగొడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. వావ్ సూపర్ అంటున్న నెటిజన్లు
‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరుస సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.
ప్రజెంట్ ఈ అమ్మడు తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్(Bollywood)లోనూ వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. కళ్లకు కాటుక పెట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపించింది. అలాగే వైట్ తెర వెనుక నిలబడి ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా వాటికి.. ‘బయట అంతా మంచు, లెక్కించదగ్గ చోటంతా నిప్పు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ ఉన్నావు అని కామెంట్స్ చేస్తున్నారు.






