కొత్తగా పెళ్లి... ఆ రూమ్ లో టాలీవుడ్ హీరోయిన్ అరుపులు, కేకలు!

by velandi.Saikiran |   (  Updated:2025-07-03 14:24:55  IST  )

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా... కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపు ఉంటుంది. అలాంటి వారిలో

కొత్తగా పెళ్లి... ఆ రూమ్ లో టాలీవుడ్ హీరోయిన్ అరుపులు, కేకలు!
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా... కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపు ఉంటుంది. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఒకరు. కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో మహానటిగా ఆమె కొనసాగుతున్నారు. మహానటి అలాగే దసరా లాంటి ఎన్నో బంపర్ హిట్ సినిమాలు చేసిన కీర్తి సురేష్... ప్రస్తుతం బాలీవుడ్ లో ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నారు.

అయితే అలాంటి కీర్తి సురేష్ తాజాగా ఉప్పు కప్పురంబు (Uppu Kappurambu) అనే సినిమా తీశారు. ఇందులో కీర్తి సురేష్... ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాను కేవలం 28 రోజుల్లోనే ఫినిష్ చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ తో పాటు హీరో సుహాస్ కూడా ఉన్నాడు. ఈ సినిమాను సెటైరికల్ కామెడీ డ్రామాగా శశి రూపొందిస్తున్నారు. రాధిక ఈ సినిమాకు నిర్మాతగా కొనసాగుతున్నారు.

అయితే ఈ సినిమా జూలై 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే రేపటి నుంచి అందుబాటులోకి రాబోతుంది ఈ సినిమా. అంతేకాదు ఈ సినిమాను... కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు అలాగే తమిళం ఇలా ఐదు భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ ఐదు భాషలకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తిచేసిన వీడియోను తాజాగా పంచుకున్నారు కీర్తి సురేష్. ఇక ఈ వీడియోలో అన్ని భాషల్లో డైలాగులు చెబుతూ కీర్తి సురేష్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అరుపులు, కేకలు పెడుతూ జాలిగా కనిపించారు.

Next Story