కిర్రాక్ ఫొటోస్‌తో కిక్కెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ అయినావంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

కిర్రాక్ ఫొటోస్‌తో కిక్కెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ అయినావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక ‘దసరా’(Dasara), ‘మహానటి’(Mahanati) సినిమాలతో అవార్డులు కూడా తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకుంది. అలాగే రీసెంట్‌గా ‘బేబీ జాన్’(Baby Jahn) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. బట్ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌(Antony Thattil)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో ట్రెండీ వేర్‌లో దర్శనమిచ్చింది. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, పోనిటెల్ వేసుకుని క్యూట్ స్మైల్‌తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. మ్యారేజ్ తర్వాత మరింత బ్యూటిఫుల్‌గా అవుతున్నావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story