- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలిగెంట్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్.. గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్
బేబీ పింక్ కలర్ లెహంగాలో బుట్టబొమ్మలా రెడీ అయిన రకుల్ ప్రీత్ సింగ్.

దిశ, వెబ్‌డెస్క్: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది.
ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. అయితే ఈ మధ్య రకుల్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బేబీ పింక్ కలర్ లెహంగాలో బుట్టబొమ్మలా రెడీ అయింది. జుట్టు విరబోసుకొని, ఎలిగెంట్ లుక్‌లో సూపర్ క్యూట్ అనిపించింది. ఇక ఈ పిక్స్‌కు ‘హలో, నూతన సంవత్సరం. దయతో, ప్రశాంతంగా మరియు గులాబీ రంగులో ఉందాం’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






