- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్పిటల్ బెడ్‌పై దీనస్థితిలో టాలీవుడ్ హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి(Surekha Vani) కూతురు సుప్రీత(Supreetha) ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి(Surekha Vani) కూతురు సుప్రీత(Supritha) ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించనుంది. ప్రస్తుతం సుప్రిత చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘లేచింది మహిళా లోకం’(Lechindi Mahilalokam). అలాగే బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్(Amar Deep)తో కలిసి మరో మూవీలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటితో పాటు ‘అమరావతికి ఆహ్వానం’(amaravathiki Ahwanam) పేరుతో తెరకెక్కుతోన్నమరో హారర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది ఈ బ్యూటీ.
అయితే ఉన్నట్టుండి ఆమె ఆస్పత్రి పాలైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించింది. ఆస్పత్రి బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటోన్న ఫొటోలను షేర్ చేసిన సుప్రిత ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ‘దిష్టి నిజమే. జీవితంలో బలంగా ఎలా ఉండాలో ఈ వారం తెలిసొచ్చింది. నేను శివయ్యను బాగా నమ్ముతాను. కానీ ఆయనకు నాపై కోపం వచ్చినట్లు ఉంది. అయినా శివయ్య, అమ్మ, ప్రసన్న, రమణ.. వీళ్లు లేకుండా నేను లేను. జీవితం ఎప్పటికప్పుడు నన్ను పరీక్షిస్తోంది. దిష్టి నా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. శారీరక, మానసిక ఆరోగ్యం ఎప్పుడూ ముఖ్యమే’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆమెకు అసలు ఏమైంది అని ఫ్యాన్స్ ఫుల్ ఆందోళన చెందుతున్నారు.






