Pawan Kalyan: బురఖా ధరించి పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్ (వీడియో)

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్ని చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేశారు.

Pawan Kalyan: బురఖా ధరించి పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్ (వీడియో)
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్ని చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేశారు. ఎంతోమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడంతో పాటు స్టార్ హీరో అయ్యారు. అయితే ఆయన కోసం ఎంతోమంది ప్రాణాలు కూడా ఇస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే పవన్ కళ్యాణ్‌కు సినీ సెలబ్రిటీల్లో అభిమానులు ఉన్నారు. అయితే ఓ యంగ్ హీరోయిన్ ఆయన సినిమా చూసేందుకు బురఖా వేసుకుని మరీ థియేటర్‌కు వెళ్లినట్లు సమాచారం.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఈ విషయాన్ని తెలుపుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘అంత పెద్ద యాక్టర్ ఆయన గురించి నేనేం చెప్పాలి. ఆయన నా గురించి ఏమైనా చెప్తే బాగుంటుంది. నేను ఎంత పెద్ద అభిమాని అంటే ‘భీమ్లా నాయక్’(Bhimla Nayak) సినిమాను ఉదయం 7గంటలకు బురఖా వేసుకుని వెళ్లి ఫస్ట్ షో చూశాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

కాగా, అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో శతమానం భవతి, అఆ, హలో గురు ప్రేమకోసమే, కార్తికేయ వంటి సినిమాలతో హిట్స్ సాధించింది. ఇటీవల అనుపమ నటించిన ‘డ్రాగన్’ (Dragon)మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది.

Next Story