- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజు రోజుకూ గ్లామర్ డోస్ పెంచుతున్న సీనియర్ హీరోయిన్.. తట్టుకోలేకపోతున్నామంటున్న కుర్రాళ్లు!
నటి జెనిలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: నటి జెనిలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా.. హింది, కన్నడ భాషల్లో కూడా నటించి ప్రేక్షకుల మనసులో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. జెనిలియా తెలుగు సినిమా వార్తల విషయానికొస్తే..
ఒకప్పుడు జెనిలియా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. బొమ్మరిల్లు లాంటి హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇటీవలి కాలంలో, జెనిలియా దక్షిణాది చిత్ర పరిశ్రమకు రుణపడి ఉన్నానని, బలమైన పాత్రలు లభిస్తాయని నమ్ముతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తెలుగులోనే కాకుండా.. జెనీలియా 2003లో ‘తుఝే మేరీ కసమ్’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో ఆమె తమిళ చిత్రం బాయ్స్‌లో నటించింది. తెలుగులో సత్యం, బొమ్మరిల్లు, సాంబ, సై, మిస్టర్ మేధావి, రెడీ, ఢీ, హ్యాపీ వంటి హిట్ సినిమాల్లో నటించింది. తర్వాత ఇక జెనీలియా నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఈ బ్యూటీ సినిమాలకు దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది. ఇకపోతే తాజాగా ఈ అమ్మడు నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. కుర్ర హీరోయిన్‌ను తలపిస్తోన్నఈ పిక్స్ కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నాయి. ఇంత ఏజ్‌లో కూడా అంత అందం ఎలా మెయింటైన్ చేస్తున్నారంటూ జెనిలియా మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.instagram link






